🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 19 December 2021, 10:43 am Posted by : HINDUSTAN

గ్రామపంచాయతీ సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర


ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని కామగిరి గ్రామపంచాయతీ సర్పంచ్ తొడసం భీంరావ్ గ్రామపంచాయతీ లో నెలకొన్న సమస్యలపై స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా గ్రామ పంచాయతీలో నెలకొన్న ఎటువంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సమస్యల పరిష్కారం కోసం రామగిరి సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టారు. కామగిరి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆదివారం రోజు గ్రామస్థుల సమక్షంలో తన గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి జరగడం లేదని తెలుపుతూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈ పాదయాత్రను చేపట్టినట్టు సర్పంచ్ తోడ సన్ భీమ్ రావు తెలిపారు.





🏠 Home