🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 27 November 2021, 3:32 pm Posted by : HINDUSTAN

బస్టాండ్ వద్ద అద్వాన్నంగా సర్వీస్ రోడ్డు







రిపబ్లిక్ హిందూస్ధాన్, గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు గల సర్వీస్ రోడ్డు పరిస్థితి అధ్వనంగా మారింది. మిషన్ భగీరథ పైప్ లైన్ వేసే క్రమంలో రోడ్డు తవ్వి అలాగే వదిలేశారు. పనులు చేసి నెలలు గడుస్తున్నా రోడ్డు గురించి అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.అక్కడక్కడ గుంతలు ఏర్పడి కంకరరాళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. విద్యార్థులకు , ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. వాహన చోదకులకు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, మళ్ళీ సర్వీస్ రోడ్డు ని పునరుద్దరించాలని ప్రజలు కోరుతున్నారు.

🏠 Home