🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2021, 3:10 pm Posted by : HINDUSTAN

గ్రామాల సమస్యలు పరిష్కరిస్తున్న యువ ఎంపీపీ ....


మండలంలో రోజు ఏదొక గ్రామాన్ని సందర్శిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న వైనం...




నిన్న గుండి వాగు గ్రామానికి బ్రిడ్జి మంజరు కు హామీ ... నేడు పాఠశాల మరమ్మత్తులకు నిధులు కేటాయింపు....




రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి మండలంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజలకు హామీలు ఇస్తున్నారు. తాజాగా ఈ రోజు మండల కేంద్రంలో ని అడేగామా గ్రామ పాఠశాల మరమ్మత్తు లకు ఎంపీపీ నిధుల నుండి లక్ష యాభై వేల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.




నిన్న మండలంలోని గుండివాగు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు బ్రిడ్జి సమస్య ఉందని గుర్తించి వెంటనే బ్రిడ్జి తాలూకు ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. త్వరలో ఎమ్మెల్యే ను కలిసి బ్రడ్జి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

🏠 Home