🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2021, 1:33 pm Posted by : HINDUSTAN

నవోదయ కు ఎంపికైన ఇచ్చొడ మండల విద్యార్థినిలు


రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ప్రవైట్ పాఠశాల లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు జవహర్ నవోదయ పాఠశాల ప్రవేశ అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచారు. నవోదయ పాఠశాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఉదయ చంద్రిక తెలిపారు. కోకస్ మన్నూరు గ్రామానికి చెందిన పాముల బుద్ధ ప్రియ, ఇచ్చోడకు చెందిన యామీని అనే విద్యార్థినీలు నవోదయ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష గత నెల ఆగస్టులో రాశారు. ఇద్దరు కూడా ఉత్తీర్ణత సాధించి నవోదయ పాఠశాలకు ఎంపిక కావడంతో తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.

🏠 Home