🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 September 2021, 12:37 pm Posted by : HINDUSTAN

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కై ఎమ్మెల్యే కు వినతిపత్రం...


రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్/ ఇచ్చోడ : మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం నాయకులు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు . ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ వేయ్యికోట్ల రూపాయల తో ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. బోథ్ నియోజకవర్గ సంఘం కన్వీనర్ శివన్న ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఏర్పాటు కోసం వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి అశోక్ , జిల్లా అధ్యక్షుడు విఠల్ , కాళ్ళ విఠల్ , బలగం రవి మరియు తాంసీ , తలమడుగు , భీం పూర్ , సిరికొండ, ఇచ్చోడా మండల కోఆర్డినేటర్లు నరాల రమణయ్య , కంది నరసింహులు, ఆత్మ చైర్మన్ రవీందర్, ఎంపిటిసి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

🏠 Home