పత్తి పంటలో అక్రమంగా గంజాయి సాగు – నిందితుడి అరెస్ట్* *60 గంజాయి మొక్కల స్వాధీనం
adilabad : గాదిగూడ మండలం పరస్వాడ-బి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా 60 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 1 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగిన 60 గంజాయి మొక్కల విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సులభంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన తండ్రి వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి మొక్కలను సాగు చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు.
*అరెస్టైన నిందితుడు:*
కోడప మారుతి S/o పగ్గు, వయస్సు 34 సంవత్సరాలు, వృత్తి: రైతు, నివాసం: పరస్వాడ-బి, గడిగూడ మండలం.
గంజాయి సాగు, విక్రయం, రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉట్నూర్ ASP రిత్విక్ సాయి కొట్టే IPS తెలిపారు. గంజాయి సాగు లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ దాడిలో నార్నూర్ సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.