అధికారుల నిర్లక్ష్యానికి పెదపిల్లల భవిష్యత్ బలి….
Thank you for reading this post, don't forget to subscribe!
అధికారుల నిఘా కొరవడడతో యథేచ్ఛగా తెల్ల పసి పిల్లలకు తెల్ల కల్లు అమ్ముతున్న వైనం…
అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం ఈ క్రింది వార్త…..

ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కనిపించిన దృశ్యం పేదల పట్ల పాలకుల వైఖరేంటో స్పష్టం చేస్తోంది. గురువారం ఇచ్చోడ మండలంలో ఉన్న కల్లు దుకాణంలో చదువుకోవాల్సిన చిన్న చిన్న పిల్లలు తెల్ల కల్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.
లక్షల్లో జీతాలు తీసుకునే అధికారులు వీటి పై దృష్టి సారించకుండా మాములుగా నే విషయాన్ని భావించడంతో పసి వాళ్ళ భవిష్యత్ ను అంధకారంలో నెట్టేస్తున్నారు.
ప్రజల ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో ను కాపాడలనే ఉద్దేశ్యం మాస్కు , హెల్మెట్ లేకుండా తదితర విషయాల్లో పోలీసు వ్యవస్థ కూడా గట్తిగా పనిచేస్తుంది. కానీ రోడ్డు పక్కన జరిగే ఇలాంటి వాటి పై కూడా దృష్టి సారించి , ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న చేయిస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ వేరే వారు చేయడానికి భయపడతారు.
*చిన్న పిల్లలు కల్లు తాగే విషయం మరియు కల్లు బట్టికి వచ్చే తెల్లకల్లు విషయం లో ఇచ్చోడ ఎక్సైజ్ సిఐ రాజమౌళి ని వివరణ కోరగా కల్లు బట్టీల నిర్వహణ పై అంతగా దృష్టి సారించలేదని అన్నారు. ఆ దుకాణాలకు సప్లై జరిగే కల్లు గురించి తమ వద్ద ఎలాంటి వివరాలు ఉండవని అన్నారు. చిన్న పిల్లలు తాగుతున్న విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు.మేము కేవలం వైన్స్ షాపుల వివరాలు మాత్రమే ఉంచుతామని అన్నారు.
ఇప్పుడు మాత్రం పిల్లలకు అమ్మకూడదని యజమానులకు చెబుతానని చెప్పడం గమనార్హం.
పూర్తి వార్త ను రేపటి రిపబ్లిక్ హిందుస్థాన్ దినపత్రికలో చూడండి…..