republichindustan.in
Newspaper Banner
Date of Publish : 24 January 2023, 1:44 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ

రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ : తెలంగాణ విభజన చట్టంలోని హామీల సాధన కోసం కృష్ణాజిల్లాలో న్యాయమైన మన వాటా కోసం,
కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత రాజకీయాలను  ఎండ కట్టడం కోసం,
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనకై ప్రజలను సంఘటితం చేయడం కోసం తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 30,31  చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి 30వ తారీఖున జంతర్ మంతర్ వద్ద కృష్ణాజిల్లాలో మన వాటా విభజన హామీ సాధనకై దీక్ష,
మరియు 31 తారీకున కాన్స్టిట్యూషన్ క్లబ్లో కెసిఆర్ 9 ఏళ్ల పాలన అభివృద్ధి- వాస్తవాలపై సెమినారు నిర్వహిస్తున్నందున దాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలందరూ సహకరించాలని కోరుతూ మంగళవారం రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద కార్యకర్తల సమక్షంలో టి జె ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆడే సునీల్ కుమార్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం
ఖర్చు చేయవలసిన లక్షల కోట్ల రూపాయలను కాళేశ్వరం లాంటి పనికిరాని ప్రాజెక్టులకు ఖర్చు చేసి కాంట్రాక్టర్ల లాభాల కోసం ,కమిషన్ల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.తెలంగాణ ప్రజల మద్దతుతో,1200 వందల మంది అమరవీరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గొంతు నొక్కి నిరంకుశంగా పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించి మూడున్నర లక్షల కోట్లు అప్పు చేసి కూడా నేడు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా తీయించారు. ఎప్పటికప్పుడు తన సంపాదన కోసం, కుటుంబ సభ్యుల అధికారాల కోసం తపన పడుతూ ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే పోరాటం చేసాము ఆ తెలంగాణ పదాన్ని అవహేళన చేస్తూ తన పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశాన్ని ఉద్ధరిస్తాను అంటున్నాడు. రాష్ట్ర సమస్యలు ఎక్కడెక్కడ ఉండగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం దేశవ్యాప్తంగా అధికారం కోసం కక్కుర్తి పడుతున్నాడు. ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను దేశవ్యాప్తంగా తెలియజేయడం కోసం ఢిల్లీలో కార్యక్రమాలు చేపట్టినందున అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ , ఆదిలాబాద్ జిల్లా ప్రధానకార్యదర్శి టేకం వినాయక్, నాయకులు రాజ్ కుమార్, సునీల్, రమేష్, అయ్యు, కిరణ్,అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!