Thank you for reading this post, don't forget to subscribe!
ఇచ్చోడ : భూమికోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం వీరోచితంగా పోరాడిన వీరనారి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఇచ్చోడా మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రజక సంఘం సభ్యులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరనారి చిట్యాల ఐలమ్మ పాత్ర మరువలేనిదని,భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరులో ఆమె కీలక పాత్ర పోషించారని చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో, ధైర్య సాహసాలతో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు అరుగుల గణేష్ ఉపాధ్యక్షులు నాగరాజ్ దేవురాజు కోశాధికారి గంగాధర్ దేవన్న భూమన్న శేఖర్ అనిల్ సురేష్ రాజు ప్రవీణ్ విక్కీ ప్రణయ్ రవి శివ తదితరులు పాల్గొన్నారు.