republichindustan.in
Newspaper Banner
Date of Publish : 08 April 2024, 4:59 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

కారులో ఊపిరాడక బాలుడు మృతి

నిజామాబాద్ జిల్లా:ఏప్రిల్ 08
కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈరోజు వెలుగులోకి వచ్చింది

వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6)తో కలిసి రాకసి పేట‌లోని హనుమాన్ టెంపు ల్ ప్రాంగణం‌లో కూలి పనులకు వెళ్లారు.

ఈ క్రమంలో తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, కుమా రుడు రాఘవ ఆడుకుంటా నని చెప్పి వెళ్లి తిరిగి రాలే దు. బాలుడు కనిపించక పోయే సరికి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండు రోజులుగా మిస్సింగ్ అయిన బాలుడు అదే ఏరియా‌లో పార్క్ చేసిన ఓ కారులో కనిపించాడు. కారు డోర్లు తెరచుకుని ఉన్నప్పు డు బాలుడు అందులోకి వెళ్లగానే కారు ఒక్కసారిగా లాక్ అయింది.

దీంతో ఆ చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందా డు. గత రాత్రి కారు యజమాని బయటకు వెళ్లేందుకు కారు తీస్తుం డగా.. కారులో మృత దేహాన్ని గుర్తించి అతడు స్థానిక పోలీసులకు సమా చారం అందించాడు.

ఈ మేరకు బాలుడి మృత దేహాం గురించి తల్లిదండ్రుల కు సమాచారం అందించి పోస్ట్‌మార్టం తరలించారు…