రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (మార్చ్ 14 ) : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని,సరైన వసతులు లేవని, ఉన్న వైద్య సిబ్బంది ప్రవర్తనలు సరిగా లేవని ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేయాలని బిఎస్పీ పార్టీ జోనల్ మహిళా కన్వీనర్ మద్దేల భవాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రెస్ క్లబ్ లో బిఎస్పీ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావ్ మంచిర్యాల జిల్లా కు వస్తున్న సందర్బంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని,చెన్నూర్ ఆస్పత్రిని సందర్శించి వాటి నిర్వహణ ఎలా ఉందో తనిఖీ చేయాలన్నారు.జిల్లలోని వివిధ మండలాల నుంచి వచ్చే నిరుపేదలకు సరైన వైద్యం అందడం లేదన్నారు.ప్రభుత్వ ఆస్పత్రి లో పనిచేస్తున్న వైద్యులు ప్రభుత్వం అందిస్తున్న వేతనం తీసుకుంటూ ప్రైవేట్ అస్పత్రులు నిర్వహిస్తున్నారని అన్నారు.జిల్లాకు వస్తున్న మంత్రి అస్పత్రిని సందర్శించకుండా వెళ్తే బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద,చెన్నూర్ అసెంబ్లీ కన్వీనర్ రాసపెల్లి రాజకుమారి, మహిళ నాయకులు సరిత,లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!