మంచిర్యాల మార్చ్ 29 (రిపబ్లిక్ హిందుస్థాన్) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గత మూడు రోజులుగా వస్తున్న వరుస కథనలా వార్తలు ఆరోపణలు కావని,వాస్తవాలు అని,అరిజిన్ డైయిరి వారిని మోసం చేసిన మాట నగ్న సత్యం అని, ఒకవేళ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మోసం చేయకపోతే తన వాటా పెట్టుబడిగా తుడుం ప్రకాష్ తో అగ్రిమెంట్ చేయించి, రెండు ఎకరాల భూమి అని చెప్పి ప్రభుత్వ భూమిని తన భూమిగా చూపించి,కోటి రూపాయలు ఇవ్వాలని భూమి పూజ చేయించారని మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం వి గుణ ఆరోపించారు.అది ప్రభుత్వ భూమి అనే విషయం బట్టబయలు అవడంతో కోటి రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసి కంపెనీ వారి నుండి అప్పటికే దాదాపు ఇరవై లక్షలు తీసుకున్నాడని, కొంతమందిని రైతులు డబ్బులు పేమెంట్ చేయకుండా చేసి వారితో దాడి చేయించగా, ఫిర్యాదు ఇచ్చిన వారి మీదే అక్రమ కేసులు పెట్టించారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆది నారాయణ మీద 13 అక్రమ కేసులు పెట్టించారని ఇప్పటికైనా ఎమ్మెల్యే చిన్నయ్య పద్దతి మార్చుకోవాలని లేని పక్షంలో బిఎస్పీ పార్టీ చిన్నయ్య గద్దె దిగే వరకు పోరాడుతుందని, మహిళల పట్ల అనుచిత ప్రవర్తనకు బిఎస్పీ పార్టీ మహిళా కార్యకర్తలే బుద్ది చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ కనకం విజయ్,పార్టీ జోనల్ మహిళా కన్వీనర్ భవానీ, జిల్లా మహిళా కన్వీనర్ బొడ్డు వినోద, అసెంబ్లీ కన్వీనర్ రాజకుమారి పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!