రిపబ్లిక్ హిందుస్థాన్, వెబ్ డెస్క్ :
రాష్ట్రంలో హిందూ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్న సందర్భంలో హిందూ సమైక్య శక్తి చాటుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బిజెపి తెలగాణ రాష్ట్ర అధ్యక్షుడు&ఎంపి బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటలో తెలిపారు. ఈ తరుణంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని మే 14 ఆదివారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో నిర్వహిస్తున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర”లో ముఖ్య అతిథులుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరియు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ పాల్గొంటున్నారని అన్నారు. హిందువులు భారీ సంఖ్యలో తప్పక పాల్గొని, హిందూ సంఘటిత శక్తి చాటగలరని విజ్ఞప్తి చేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!