Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఆదిలాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రం లోని వినాయక్ చౌక్ లో గురువారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు నల్ల కండువాలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తూ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు దాడిని సంబందించిన ముందస్తు సమాచారం ఇచ్చిన తరువాత కూడా రక్షణ కల్పించకపోవడంలో విఫలమయ్యారని అన్నారు. హైదరాబాద్ నుండి రౌడీ షీటర్లు, పక్క జిల్లా నుండి గుండాలు రైతుల ముసుగులో దాడికి కుట్రపన్నిన విషయం కమీషనర్, ఎస్పీలకు సమాచారం ఇచ్చిన కూడా ముందస్తు సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదని ఆయన అన్నారు. రాష్ట్రం లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుందా అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణుగోపాల్,లోక ప్రవీణ్ రెడ్డి,రవిరెడ్డి,లాలామున్నా,ఆకుల ప్రవీణ్,దినేష్,భూమన్న,ముకుంద్, రత్నాకర్,రాజన్న,మహేందర్ మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.