republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 May 2022, 4:23 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఘనంగా బసవేశ్వరుని జయంతి ఉత్సవాలు

రిపబ్లిక్ హిందుస్థాన్,బజార్ హత్నూర్ :  మండలంలోని భోస్రా గ్రామము లో మంగళవారం  బసవేశ్వరుని జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో భాగంగా   వీర శైవ లింగాయత్, లింగ బలిజలకు  ఎంపీటీసి సొంటకే గజానంద్    శుభాకాంక్షలు   తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సమాజంలో కుల,వర్ణ, లింగ వివక్షతను రూపుమాపడం కోసం అహర్నిశలూ కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని  కొనియాడారు. సాహితీవేత్తగా, ఆనాటి పాలనా వ్యవస్థలో భాగస్వామిగా సమానత్వం కోసం, ప్రజా సంక్షేమం కోసం పోరాడిన బసవేశ్వరుని సిద్ధాంతం భారత మత, సామాజిక చరిత్రలో విప్లవాత్మకమైనదిగా నిలిచిపోయింది. మానవీయమైన బసవేశ్వరుని ఆశయాలు నేటికీ ఆచరణీయమని అన్నారు.
బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడింది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం రాసినట్లు పేర్కొన్నారు. మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు, శివుడే సత్యం, నిత్యం దేహమే దేవాలయం, స్త్రీ పురుష భేదంలేదు
శ్రమను మించిన సౌందర్యంలేదు.
భక్తికన్నా సత్ప్రవర్తనే ముఖ్యం.
దొంగలింపకు, హత్యలు చేయకూడదని బోదించారాని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!