హైదరాబాద్ , డిసెంబర్06 :
తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నారు.
తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఏకపక్ష తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం దక్కించుకోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చే స్తుండటంపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.
రేపు తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్బి స్టేడియం గ్రౌండ్లో జరుగు తున్న ఏర్పాట్లను ఆయన నేడు పరిశీలించారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తన కల అని పేర్కొన్న ఆయన తాను చెప్పి నట్టుగానే జరుగు తున్నందుకు తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
రేపే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం అని చెప్పడంతో తాను సంతోషించానని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీని ముందుకు నడిపించిన తీరు బాగుందని బండ్ల గణేష్ కితాబిచ్చారు.
తాను ముందుగా చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు
ఈ రాత్రికి ఎల్బీ స్టేడియంలోనే నిద్రపోతా: బండ్ల గణేష్
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments