republichindustan.in
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 4:50 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

మోకాలి నొప్పికి నడుము చికిత్స చేసిన బాబా అరెస్టు

నాటు వైద్యం పేరిట ప్రజలను మోసం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవు.

Thank you for reading this post, don't forget to subscribe!

మోకాలి నొప్పికి నడుము చికిత్స చేసిన బాబా అరెస్టు, రిమాండ్

నాటు వైద్యం చేసే బాబాలను,మంత్ర గాళ్లను ప్రజలు విశ్వసించ వద్దు

చదువుకొని వైద్య డిగ్రీ సాధించిన వారిని మాత్రమే విశ్వసించాలని సూచన.

బోథ్ నందు నాటు వైద్యం చేసి బాధితురాలికి నయం చేయకపోగా, మరింత వికటించేలా చేసిన బాబా అరెస్ట్.

బోథ్ పోలీస్ స్టేషన్ నందు 5 గురి పై కేసు నమోదు, బాబా అరెస్ట్.

ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ క్రైమ్ న్యూస్ : మోకాలి నొప్పికి నడుము చికిత్స చేసిన బాబా అరెస్టు, రిమాండ్ తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.

వివరాలలో……  నాటు వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసేవారిని పోలీసు యంత్రాంగం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో, ఇతరులు చెప్పిన మాటలు విని బోత్ మండలం కొల్లాపూర్ లోని చందర్ సింగ్ స్వామి ని సంప్రదించగా, నాటు వైద్యం చేసి బాధితురాలికి నయం చేస్తానని నమ్మబలికి, బాధితురాలికి మోకాలి నొప్పులు నయం చేయకపోగా నాటు వైద్యం పేరుతో, బాధితురాలిని ఇద్దరు మనుషుల సహాయంతో పట్టుకొని నడుము భాగంలో కాలితో తన్ని నడుము ను గాయపరిచి, నడుము భాగంలో ఉండేటువంటి L2,L4,L5 గాయాలు చేయగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బోత్ పోలీస్ స్టేషన్ నందు 5 గురి పై కేసు నమోదు చేసి బాబా చందర్ సింగ్ స్వామి ని అరెస్టు చేయడం జరిగిందని, రిమాండ్ కు తరలించడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఈ ఘటనకు సహకరించిన పెందూరి మనోహర్, సోయం సతీష్ కుమార్ లపై, మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఘటన నందు బాధితురాని వద్ద నుండి 20,000 ఆన్లైన్ ద్వారా మరియు ఒక లక్ష 50 వేల రూపాయలను చేసిన పూజలలో పూజా సామాగ్రి పేరుతో వసూలు చేసి మోసం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు నాటు వైద్యాన్ని చేసే బాబాలను, మంత్రగాళ్లను నమ్మకుండా ప్రభుత్వం ద్వారా డిగ్రీ పొందినటువంటి వైద్యులను సంప్రదించాలని సూచించారు. నాటు వైద్యం ద్వారా వారి ఇబ్బందులు వ్యాధులు నయం కాకపోగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సూచించారు. నాటు వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసే వారిని జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ ఘటనలో మహిళను ఆసుపత్రి నందు చూపించగా దాదాపు 24 లక్షల రూపాయలను ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు అన్నారు.