రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : మండల కేంద్రం లోని గురువారం రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో లో నాబార్డ్ కళా జాత బృందం మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థుల కు బ్యాంకు అకౌంట్ ల పైన అవగాహన కల్పించారు,10, సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు బ్యాంకు అకౌంట్ కల్గి ఉండాలని విద్యార్థులకు తెలియజేసారు. బ్యాంకు అకౌంట్ లపై వాటి ప్రయోజనాల పై పలు సూచనలు సలహాలు చేసారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోత భీమా, ప్రధాన మంత్రి అటల్ పెన్షన్ యోజన,తదితర వాటి పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యురాలు ప్రతుష, సీనియర్ ఉపాధ్యాయుడు ప్రసాద్, పాఠశాల ఛైర్మెన్ లలిత, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ వినీత్,ఐకేపీ సీసీ పురోషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!