Friday, February 7, 2025

వివిధ కేసులలో పోలీసు శాఖలో పట్టుబడిన వాహనాల వేలం

— వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 116 స్క్రాప్ వాహనాలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

పోలీసుల ఆధీనంలో ఉన్న వివిధ నేరాలకు సంబంధించినవి, దొరికిన వాహనాలు (అన్నోన్ ప్రాపర్టీ కింద) జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో (108) ద్విచక్ర వాహనాలు, (5) ఆటోలు, (3) నాలుగు చక్రాల వాహనాలు మొత్తం 116 వాహనాలపై చట్టపరమైన విధానాలను అనుసరించి కేసు నమోదు చేయడం జరిగిందని, గత ఆరు నెలల నుండి పై వాహనాల గురించి ఎవరూ రానందున అన్నోన్ స్క్రాప్ ప్రాపర్టీ గా పరిగణించి వేలం వేయడం జరుగుతుందని,  తేది 03-06-2022 శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏ ఆర్ హెడ్ కోటర్స్ ఆదిలాబాద్ నందు వేలం వేయబడును అని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఇందుమూలంగా ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నొన్ ( unclaimed /abandoned  vehicles ) వివిధ రకములైన స్క్రాప్ మోటార్ సైకిల్ 108 , ఆటోలు 5, నాలుగు చక్రాల వాహనాలు 3, మొత్తం 116 వాహనాలపై 102 సీఆర్పీసీ కేసులు నమోదు చేసి పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు సంబంధిత వాహన యజమానులు ఎవరైనా ఉంటే వాహన డాక్యుమెంట్లు చూపించుకుని వాహనాలను తీసుకుని వెళ్లాలని తెలపడం జరిగింది. గత 6 నెలల నుండి ఎవరు రానందున అన్నోన్ ప్రాపర్టీ గా పరిగణించి ఏఅర్ హెడ్ కోటర్స్ నందు ఉంచడం జరిగింది. ఆరు నెలల కాల వ్యవధి 30-05-2022 తో ముగుస్తున్నందున జిల్లా పరిధిలోని 116 వివిధ రకాలైన వాహనాలను, జిల్లా ఎస్పీ ద్వారా నియమించబడిన బహిరంగ వేలానికి సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో తేది 03-06-2022 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు బహిరంగ వేలం పాట వేయబడును. ఆసక్తి కలవారు వేలంపాటలో పాల్గొని వేలంపాట ద్వారా వాహనాలను స్వాధీనం చేసుకొని వారు సంబంధిత వేలంపాట డబ్బులు చెల్లించి వాహనాలను తీసుకొని వెళ్ళాలని తెలిపారు.

బహిరంగ వేలం పాటలో పాల్గొనే వారు తమ వెంట వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డులు (కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదించబడినది) వారి వెంట తీసుకొని రాగలరు. ఎటువంటి సందేహాల కైనా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎంటిఓ బి శ్రీపాల్ (9440900676) సంప్రదించగలరు అని తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!