4 కిలో మీటర్ల వరకు భారీ ర్యాలీ తో తుది వీడ్కోలు….
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చొడ : భారత్ ఆర్మీ హావల్దార్ జవాన్ కేంద్రే సంజీవ్ అంత్యక్రియలు బుధవారం రోజు జన సందోహం లో జరిగింది. సుడాన్ దేశంలో ఆర్మీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కేంద్రే సంజీవ్ గుండె పోటు తో మృతిచెందారు.
ఇంటికి రావడానికి ప్లైట్ టికెట్ బుక్ చేసుకోగా,బుధవారమే ప్రయాణం ఉండే… కానీ ఇదే రోజు అనగా అంత్యక్రియల జరగడం తో పలువురు కంటతడి పెట్టుకున్నారు.
ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వినాయక్ ఊర్మిల దంపతుల కు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు గోవింద్ ఉద్యోగం చేస్తుండగా , చిన్న కొడుకు కేంద్రే సంజీవ్ దేశ సేవ కోసం ఆర్మీలో ఉద్యోగం పొంది సుడాన్ దేశం లో విధులు నిర్వహిస్తున్నారు. జవాన్ కు
భార్య శీతల్ మరియు రెండు సంవత్సరాల
కూతురు ఆరోహి ఉన్నారు.
ముఖగ్ని ఇచ్చే సమయంలో చిన్నారి తన తండ్రి వైపు అమాయకంగా చూడగా ఒక్కసారిగా ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు.
- జవాన్ అంత్యక్రియల చివరి చూపు కోసం భారీగా తరలి వచ్చిన జనం *
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది.
కేంద్రే సంజీవ్ అంతిమ యాత్ర ఇచ్చోడ మండల కేంద్రం నుండి నర్సాపూర్ వరకు సాగింది.
అంతిమయాత్రకు 4 కిలోమీటర్ల మేర జనం ర్యాలీగా తరలి వచ్చారు. ప్రతి గ్రామం వద్ద జవాన్ పార్థివదేహానికి జనం నివాళులర్పించారు. అడుగడునా నీరాజనం పలికారు. జై జవాన్ , భారత్ మాత కి జై , సంజీవ్ కేంద్రే అమర్ రహే నినాదాలతో తుది వీడ్కోలు పలికారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ కేంద్రే సంజీవ్…దక్షిణ సుడాన్ లో మన దేశం నుండి యూ.యన్.మిషన్ శాంతి సైన్యం లో విధులు నిర్వహిస్తుండగా తేది 9/11/2021 నాడు గుండెపోటు రావడంతో మృత్యువాత పడ్డారు.నిన్న ఆయన పార్థివ దేహం ఇచ్చోడ కు చేరింది…ఇచ్చోడ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో భధ్రపరచారు…. బుధవారం రోజు ఇచ్చోడ నుండి నర్సాపూర్ వరకు అశేష జనాల మధ్య అంతిమయాత్ర ర్యాలీ కొనసాగింది..చివరి సారిగ అమర హవల్దార్ కేంద్రే సంజీవ్ ఇంటి వద్ద కు పార్థివ దేహం తీసుకుని వెళ్లి ఆయన తల్లితండ్రులు కేంద్రే వినాయక్, ఉర్మిళా మరియు అమర హవల్దార్ భార్య శీతల్ కు కడసారి చూయించి… అటుగా నర్సాపూర్ ప్రభుత్వ పాఠశాల వెనకాల ఏర్పాటుచేసిన స్థలానికి తీసుకువచ్చి ఆర్మీ ,పోలీస్, లాంఛనాలతో వేల మంది అశ్రునివాళు ల మధ్య అంత్యక్రియలు జరిగాయి.పార్థివ దేహానికి భోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ మేజర్ యస్.యస్.రే.డిమాన్, సుబేదార్ గోవర్ధన్ భట్, హవల్దార్ డి.గణేష్, 32 యన్.సి.సి.తెలంగాణ కమాన్డెంట్ నాయక్ సుబేదార్ గిరిధర్సింగ్ , హవల్దార్ రాకేష్ కన్నార్, త్రి రాజ్ రైఫిల్స్ సిపాయి సూర్యవంశీ గజానన్ మరియు 57 మంది సైనికుల్లో 15 మంది సైనికులు, ఆదిలాబాద్ ఎక్స్ ఆర్మీ అధ్యక్షుడు సుబేదార్ బాలాజీ డహాలే, శంకర్ దాస్, జిల్లా కార్యదర్శి బండారి కృష్ణ మరియు భోథ్ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు, నర్సాపూర్ గ్రామ పెద్దలు, యువకులు పలు మండలాల ప్రజలు సర్పంచ్, ఉప సర్పంచ్ లు అశేష జనవాహిని మధ్యలో అంత్యక్రియలు జరిగాయి.
ఇచ్చోడ సి.ఐ.రమేష్ బాబు , యస్.ఐ.లు ఉదయ్ కుమార్ , నెరడిగొండ ఎస్సై విజయ్ కుమార్ లు మరియు పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా భద్రతాఏర్పాట్లుచేశారు.
అంత్యక్రియల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే
ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ గ్రామా వాస్తవ్యుడైన ఆర్మీ హవాల్ధార్ కేంద్రే సంజీవ్ ఇటీవల దక్షణ సూడాన్ దేశములో విధులు నిర్వహిస్తూ గుండె పోటుతో ఇటీవల వీర మరణం పొందాడు..
విషయం తెలుసుకుని రెండు రోజుల క్రితం స్వయంగా నర్సాపూర్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేసి మృతదేహం రాక గురించి పై అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారూ.
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మాన్కాపూర్ గ్రామం నుండి నర్సాపూర్ వరకు శోభాయాత్ర ర్యాలీలో కాలి నడకన కార్యకర్తలతో కలసి పాల్గొన్నారు. అనంతరం జవాన్ పార్థివ దేహానికి పుష్పగుచ్ఛంముతో నివాళులర్పించారు.
ఈ సందర్బంగా అశేష జనాన్ని ఉద్దేశించి శోకతప్త హృదయంతో తను మాట్లాడుతూ,దేశం కోసం,దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన సంజీవ్ అందరి హృదయాల్లో నిలిచిపోతాడాని, ఈ అశేష జనాన్ని చూస్తుంటే తనను కన్నా తల్లిదండ్రుల జీవితం ధన్యమైందని, ఇంతమంది హృదయాల్లో నిలిచిన తను చనిపోయిన నిరంతరం ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటాడని, తన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ జోహార్లు అర్పించారు. తనతో పాటు మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీపీ డుక్రే సుభాష్ పాటిల్, రాథోడ్ సుభాష్,గుడిహత్నూర్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మ నందం, దాసరి భాస్కర్, పాండురంగ్, రాథోడ్ ప్రవీణ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు..
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments