republichindustan.in
Newspaper Banner
Date of Publish : 05 March 2023, 12:40 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

జర్నలిస్టును పరామర్శించిన ఏఐసీసీ సభ్యులు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
మండల కేంద్రంలో జర్నలిస్ట్ పై ఇటీవల జరిగిన దాడిలో కంటికి గాయమై, హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న ఏఐసీసీ సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్ దాడిలో దాడిలో గాయపడిన జర్నలిస్ట్ ఖమర్ ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్ట్ పై దాడి సరైంది కాదన్నారు. ఆయన వెంట నాయకులు జాదవ్ వసంత్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్, గుడిహాత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్యాల కరుణాకర్, బోథ్ నియోజ వర్గ మైనార్టీ చైర్మన్ ఎండీ ముస్తఫా, కాంగ్రెస్ నాయకులు ఖలీద్(జాంటి), శివాజీ, నౌషాద్, తదితరులు ఉన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!