రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున చేపడుతున్న ధర్నాకు మద్దతుగా ఈ రోజు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో బీమా కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ సంధర్భంగా శాఖ కార్యదర్శి దౌలత్ రావు మాట్లాడుతూ కుటుంబ పెన్షన్ ను బ్యాంకింగ్ సెక్టార్లలో అమలు పరిచినట్లు ప్రభుత్వ బీమా రంగ పెన్షనర్లకు కూడా 15శాతం నుండి 30శాతం వరకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు నిర్ణీత వ్యవధి ప్రకారం జరిగే వేతన సవరణల సంధర్భంగా పెన్షనర్ల బేసిక్ కూడా సవరించి నూతన బేసిక్ ను నిర్ణయించడం ద్వారా అధిక పెన్షన్ చెల్లించ బడుతుంది. ఇది ఆర్.బి. ఐ. లో అమలు చేశారు. ఇన్సూరెన్స్ రంగంలో రిటైర్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ అప్ గ్రేడేషన్ సదుపాయం ఇవ్వాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ స్కీమ్ విధానం అమలు జరుగుతున్న చోట 10శాతం బేసిక్ మరియు డి. ఏ. ల పై రికవరీ చేసి అంతే మొత్తాన్ని యజమాని జమ చేయవలసిన అంశాన్ని పునః పరిశీలించి దానిని 14శాతం గా పెంచి అమలు పరుస్తోంది. ఈ విధానం బ్యాంకింగ్ సెక్టార్లో ఇప్పటికే అమలు జరుగుతున్నందున ఇన్సూరెన్స్ రంగంలో కూడా పాత పెన్షన్ విధాన పునరుద్దరణ డిమాండ్ ను సజీవంగా ఉంచుతూనే నూతన పెన్షన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను ఇన్సూరెన్స్ రంగంలో కూడా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నషీర్, శ్రీరాం, ఫహీమ్ సిద్దిక్, చంద్రశేఖర్,రాజేంద్రప్రసాద్, సుమంత్, నీలానంద్, జగదీష్, శ్రీనాథ్ చౌదరి, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!