రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్: మండలం లోని మడాగూడ గ్రామంలో మడావి దినాకర్ తండ్రి పేరు గంగారం భార్య శనివారం సాయంత్రం వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగి నేడు ఇల్లు కాలిపోవడం జరిగింది. ఇంటిలో ఉండే నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రి సైతం కాలి బూడిదయ్యయ్. జరిగిన సంఘటన కు బాధితుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు..ఆ ఇల్లు విలువ సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని గ్రామస్తులు తెలిపారు అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితునికి పునరావాసం ఏర్పార్చాలని తనను ప్రభుత్వం తక్షణమే ఆర్ధికంగా ఆదుకోవాలని గ్రామస్తులు. మరియు బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.