republichindustan.in
Newspaper Banner
Date of Publish : 12 February 2023, 1:22 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఈ నేల15వ తేదిన అన్ని ఆదివాసి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఆదివారం రోజు ఇచ్చోడ మండలంలోని మేడిగూడ రాయి సెంటర్ భవనం నందు ఆదివాసి సేన జిల్లా స్థాయి అత్యవసర సమావేశం ఆదివాసి సేన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంఛార్జి రాయిసిడం జంగు పటేల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హాజరై మాట్లాడుతూ ఈనెల  10వ తేదిన అసెంబ్లీ వేదికగా సిఎం కేసిఆర్  పోడు భూముల పట్టాలు మరియు ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపచేశారు.  ఇట్టి విషయం ఆదివాసిల అస్తిత్వం ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నందున్న ఆదివాసులందరు ఐక్యంగా ఉండి మారో పోరాటానికి సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కోరకు ఈ నేల 15వ తేదిన రౌండ్ టేబుల్ సమావేశాని  ఉట్నుర్ కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుందని అన్నారు. ఈ సమావేశానికి అన్ని  ఆదివాసి సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసి విద్యార్థి సంఘాలు, ఆదివాసి మహిళ సంఘాలు, ఆదివాసి రైతు సంఘాలు, ఆదివాసి కార్మిక సంఘాలు, ఆదివాసి యువజన సంఘాలు, 9 తెగల ఆదివాసి కుల సంఘాలు , గోండ్వణ రాయి సెంటర్ సార్మేడిలు మరియు ఆదివాసి గ్రామల పటేలు పెద్ద సంఖ్యలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ సంబంధించి అముల్యామైన సలహాలు సూచనలు ఇచ్చి ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా ఆదివాసి సమాజానికి ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పాటు పడాలని ఆయన అన్నారు. ఈ కార్యాక్రమంలో ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు కుంరం కోటేశ్వరరావు, ఆదివాసి సేన జిల్లా ప్రధాన కార్యదర్శి కాత్లె విఠల్, ఆదివాసి రైతు సేన జిల్లా అధ్యక్షులు తోడషం భూమ పటేల్, ఆదివాసి ఉద్యోగ సేన జిల్లా అధ్యక్షులు కుంరం దశరథ్, సకల కళా జిల్లా ప్రధాన కార్యదర్శి కాత్లె శ్రీధర్, ఆదివాసి సేన సాంస్కృతిక కార్యదర్శి చహ్కటి రమేష్, ఆదివాసి సేన జిల్లా నాయకులు వేడ్మ చంపత్ రావు, అత్రం గంగారాం గ్రామ సర్పంచ్ మడావి భీంరావ్, వివిధ మండలాల ఆదివాసి సేన మండల నాయకులు, వివిధ గ్రామాల పటేల్లు , రాయి సెంటర్ పేద్దలు, వివిధ సంఘాల నాయకులు ఆదివాసి సర్పంచ్లు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!