ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం కలకలం ….
విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూసిన గుర్తు తెలియని వ్యక్తులు….
Thank you for reading this post, don't forget to subscribe!




పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులు…
పురుగుల మందు వాసన రావడం, పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు…
అప్రమత్తమై పిల్లలను త్రాగు నీరు నల్లాల వైపు వెళ్లనివ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండకపోవడంతో తప్పిన పెను ప్రమాదం…
విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు…
మధ్యాహ్న భోజనపు పాత్రలలో సైతం విషం పూసిన దుండగులు…
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విషం ఎవరు కలిపారు అనే కోణం లో దర్యప్తు చేస్తున్న పోలీసులు…
