
— జిల్లా పాలనాధికారి రాజర్షి షా
అదిలాబాద్ : ఖండాల గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఖండాల గ్రామం లో 68 కుటుంభాలు, 342 జనాభా ఉందని, ఖండాల గ్రామము నుండి 4 km దూరం లో వాగు వద్ద borewell వేసి అక్కడి నుండి పైపు లైను ద్వార ఖండాల గ్రామము లోని GLSR ట్యాంకు ద్వారా ఉదయం 7:00 గం. లకు, సాయంత్రం 6:00 గం. లకు రోజుకు 10,000 లీటర్ల నీటిని సరఫరా చేయడము జరుగుతుందన్నారు.. ఉదయము ఒక గంట పాటు, సాయంత్రము ఒక గంట నీటిని సరఫరా చేయడం జరుగుతుందనీ ఆన్నారు.
ముఖ్యంగా ఖండాల గ్రామము లో బూగర్భ జలాలు అడుగంటి పోవడము తో నీటి సరఫరా నిర్ణీత సమయం లో చేయడము జరుగుతుందని , ప్రత్యామ్నాయ దిశగా ట్యాంకర్ల ద్వారా నీటిని అవసరమైన సందర్భం లో గ్రామ పంచాయితి ట్యాంకరు ద్వార సరాఫరా చేయడము జరుగుతుందన్నారు.
మిషన్ భగీరథ నీరు రెండు రోజులకోసారి వస్తున్న సందర్భం లో తీవ్ర సమస్య ఏర్పడుతుందని గ్రామస్తులు తెలుపుతున్నారని , అయితే గ్రామస్థులకు తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా గ్రామంలో నిర్మించిన చిన్నపాటి ట్యాంకు కు సమీపంలోని బోరుబావి నుంచి పైపులైన్ కనెక్షన్ యిచ్చి . దీని ద్వారా ప్రతి రోజు ఉదయం , సాయంత్రం రెండు సార్లు ఆ ట్యాంకును నింపడం జరుగుతుందని, దీంతో ఉదయం 5 వేల లీటర్లు, సాయంత్రం ఐదు వేల లీటర్ల ను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. భూగర్బజలాలు అడుగంటి పోవడం ద్వారా నీటి సమస్య తలెత్తుతుందని అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
బావుల్లో నీరు అడుగంటిపోతున్న సందర్భం లో నీరు బురదగా వస్తున్నాయని, గ్రామస్తులు అవే నీరు త్రాగటం వల్ల అనారోగ్యానికి గురవుతారని, ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడో దూరం లో ఉన్న బావి దగ్గరికి వెళ్లి నీరు తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే భగీరథ నల్లాల ద్వారా నీటిని వినియోగించుకోవాలని, కోరారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments