ఎన్నికలను సజావుగా, విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ..
కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి.*
గత నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేత
నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ
ఆదిలాబాద్ :
స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా, సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఆదిలాబాద్ జిల్లా కు ఉన్నత స్థానాన్ని కల్పించి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృషిచేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ విజయం జిల్లా పోలీసులు అందరూ సమిష్టిగా కృషి చేసినందుకు సాధ్యమైందని తెలిపారు. రానున్న లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి ఈరోజు నుండి ఒక ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించి అవలంబించాలని సాధ్యమైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సిబ్బందిని అడిగి త్వరగా కోర్టులను చార్జిషీట్ దాఖలు చేసి పూర్తి చేయాలని సూచించారు. అలాగే గత నెలలో వర్టికల్స్ నందు జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది పోలీసు అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి సరైన ప్రతిఫలం రివార్డు లేదా అవార్డుల ద్వారా అందిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క పోలీస్ అధికారి చేసిన కృషి ఉత్తమమైనదని కొనియాడారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు ముఖ్య పాత్రను పోషించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు వి ఉమేందర్, సిహెచ్ నాగేందర్, పొతారం శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్ జి, పోలీసు ముఖ్య కార్యాలయం ఏఓ భక్త ప్రహల్లాద్, ఇన్స్పెక్టర్లు కే సత్యనారాయణ, అశోక్, ఐ సైదారావు, చంద్రశేఖర్, శ్రీనివాస్, నరేష్, ప్రేమ్ కుమార్, సతీష్, డి సాయినాథ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టీ మురళి, నవీన్, స్వామి, డి సి ఆర్ బి, ఐ టి కోర్, ఎన్ఐబి, మినిస్ట్రియల్ స్టాఫ్, అన్ని పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments