republichindustan.in
Newspaper Banner
Date of Publish : 09 July 2022, 12:00 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

తక్షణమే సహాయక చర్యల కోసం పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటన, సహాయక చర్యలు ప్రారంభం – జిల్లా ఎస్పీ

🔶 భారీ వర్షాల దృష్ట జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం

🔶 ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన

🔶 ప్రజారక్షణలో జిల్లా పోలీసు అనుక్షణం అప్రమత్తం

🔶 పర్యవేక్షణలో పోలీస్ స్పెషల్ బ్రాంచ్, ప్రత్యేక పోలీసులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది

🔶 బాధితుల సహాయం కోసం జిల్లా కేంద్రంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, 24×7 నిరంతర సహాయక చర్యలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం పొందడానికి dail -100 కు గాని, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్స్ లకు 08732226246, 9490619045 కు సంప్రదించండి

◾️జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలలో జిల్లాలోని వాగులు, నదులు, ప్రాజెక్టులు, నిండు కుండలా జలకలను సంచరించుకుంటున్నాయి. అక్కడక్కడ ప్రమాదకర స్థాయిని తలపిస్తూ నీరు వరద ప్రవహిస్తోంది. ఈ క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలను, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను తనిఖీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

అధిక వర్షాలు దృశ్య రక్షణ చర్యలను తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్ద ప్రమాదకర సాయం స్థాయిని పరిశీలించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న వాగులు, చెరువుల వద్ద పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసే పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు.

గ్రామాల్లో డప్పు చాటించి ప్రమాద బారిన పడకుండా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ముఖ్యమైన మారుమూల మండలాలు బజారత్నూర్, బోథ్, నార్నూర్, సిరికొండ, గాధిగుడ తదితర ఎస్సైలను ప్రత్యేకంగా తమ సిబ్బందితో కలిసి రక్షణ చర్యలను తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పోలీసు సిబ్బంది వద్ద సహాయక చర్యల్లో భాగంగా ఉన్న వస్తువులైన తాడు, గొడుగు, టార్చ్ లైట్ మరియు గజ ఈతగాళ్లను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకునేలా చూడాలన్నారు. రెవెన్యూ, విద్యుత్తు, ఆర్ అండ్ బి శాఖల సమన్వయంతో పోలీసు శాఖా ప్రజల సంరక్షణార్థం ఎల్లప్పుడూ నిరంతర సేవలను అందిస్తుందని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం పొందడానికి dail -100 కు గాని, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్స్ లకు 08732226246, 9490619045 ఫోన్ ద్వారా నిమిషాల్లోనే సహాయం పొందవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు గాని సంప్రదించవచ్చని తెలియజేశారు. రానున్న రెండు రోజులు పరిస్థితి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.