ఆవులను ఎట్టి పరిస్థితుల్లో సంహరించడం చట్టపరమైన నేరం

– ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సిఐ పి సురేందర్

🔶 బక్రీద్ సందర్భంగా కసాబ్(కటిక) కులస్తులతో నిర్వహించిన సమావేశం సిఐ

🔶 ప్రజలందరూ ఆవులకు సంబంధించి ఎటువంటి సమాచారం అయినా సంభదిత పోలీస్ అధికారులకు తెలియజేయాలి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదివారం స్థానిక ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ పి సురేందర్ ఆధ్వర్యంలో రానున్న బక్రీద్ పండగ సందర్భంగా పట్టణంలోని కసాబ్ ( కటిక) కులస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులను ఆవులను సంహరించ కూడదని, సంహరించినచో చట్టపరమైన నేరమని తెలిపారు. నేరనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సందర్భంలో ప్రజలకు ఆవులకు సంబంధించిన ఎటువంటి సమాచారైన నేరుగా సంబధిత పోలీసు అధికారులకు కానీ, డైల్ – 100 కి గాని సమాచారాన్ని అందించాలని సూచించారు.