republichindustan.in
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 4:44 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

రక్తదాన శిబిరానికి విశేష స్పందన : జిల్లా ఎస్పీ

• అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా జిల్లాలో నాలుగు చోట్ల రక్తదాన శిబిరం ఏర్పాటు
• జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 250 మంది పోలీసులు ప్రజలు యువత.*
• స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచిన జిల్లా ఎస్పీ, సోదరుడు, మిత్రుడు..
• ఒకప్పటి పోలీసు ప్రాణ త్యాగాల ఫలితమే ప్రస్తుత ప్రశాంత జిల్లా కు కారణం
• పోలీసులు, డాక్టర్లు వృత్తిరీత్యా ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు…
      — జిల్లా ఎస్పీ గౌష్ ఆలం

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాలుగు చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం  తెలిపారు. శనివారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేయబడిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. తదుపరి అమరవీరుల స్తూపం చిత్రపటం వద్ద పూలతో నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జిల్లా వ్యాప్తంగా ఉట్నూర్, ఇచ్చోడ, బోథ్ మరియు ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ నందు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రక్తదాన శిబిరాలలో దాదాపు జిల్లా వ్యాప్తంగా 250 యూనిట్ల పోలీసులు, ప్రజలు, ఔత్సాహికుల రక్తాన్ని రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా రక్తదానాన్ని చేయడంతోపాటు, సోదరుడు డాక్టర్ జిలాని, మరియు మిత్రుడు వికాస్ ఐఆర్ఎస్ రక్తదానాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అమరవీరుల సమస్మరణ వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఒకప్పటి పోలీసులు చేసిన త్యాగాలను జిల్లా ప్రజలకు సవివరంగా వివరించి పోలీసులు చేసే విధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలు పోలీసుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.

వృత్తిరీత్యా పోలీసులు డాక్టర్లు ఉన్నతమైన వ్యక్తిత్వంy భావాలు కలవాలని వారిని ప్రజలు గౌరవించాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పోలీసులు డాక్టర్లు ముఖ్యపాత్ర పోషిస్తూ విధుల నిర్వర్తించడం జరిగిందని గుర్తు చేశారు. ఒకప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసులు సంఘవిద్రోహశక్తులతోy పోరాడి ప్రస్తుత ప్రశాంత వాతావరణానికి కారణంగా నిలిచారని తెలియజేశారు. రక్తదానం శిబిరం పెద్ద ఎత్తున ప్రజలు పోలీసు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా, పండగల సమయంలోనైనా, ముఖ్య వ్యక్తుల పర్యటన సందర్భంలోనైనా ఎల్లవేళలా 24 గంటలు ప్రజల ధన మాన ప్రాణ రక్షణకై పోలీసులు వారి జీవితాలను త్యాగం చేస్తూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులను నిర్వర్తిస్తారని గుర్తు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో డిఎం అండ్ హెచ్ ఓ కృష్ణ, డాక్టర్లు, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, బి సురేందర్ రెడ్డి, పట్టణ సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిమ్స్ సిబ్బంది, ఎన్జీవో నాయకులు, ప్రజలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.