కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కోడెం నరేష్ ఏకగ్రీవ ఎన్నిక
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : అదిలాబాద్ జిల్లాకు చెందిన పబ్లిషర్స్, ఎడిటర్స్ వెల్ఫేర్ సొసైటీ (రిజిస్టర్డ్) నూతన కార్యవర్గాన్ని సోమవారంజిల్లా కేంద్రంలోని సినిమా రోడ్డు లో ఉన్నా కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదిలాబాద్ జిల్లాలోని వివిధ దిన, మాస, పక్ష పత్రికలు కు సంబంధించిన ఎడిటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనకార్యవర్గం ఎంపిక తో పాటు పబ్లిషర్ లకు ఎడిటర్ లకు సంబంధించిన పలు తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నూతన కార్యవర్గం లో గౌరవాధ్యక్షులుగా సాక్షర పత్రిక ఎడిటరు ఎలుగు లింగన్నను, అదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (ఆరోగ్యజ్యోతి) ఎడిటర్ కె నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు. ఉపాధ్యక్షులుగా (సమయ వాణి) ఎడిటర్ ఫిరోజ్ ఖాన్ ను, ప్రధాన కార్యదర్శిగా (నేటి వార్త) ఎడిటర్ డివిఆర్ ఆంజనేయులు ను కార్యదర్శిగా (వార్త నేత్రం) ఎడిటర్ సత్యనారాయణ ను,సంయుక్త కార్యదర్శిగా (అక్షర తెలంగాణ) ఎడిటర్ సంతోష్ ను, కోశాధికారిగా (హిందీ డైలీ) సందేశభరద్వాజ ను, ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ( ప్రభాతసమాచారం) ఎడిటర్ కరీం, ( ప్రజాజ్యోతి) ఎడిటర్ వి శ్రీనివాసరెడ్డిని ,(సమయజ్యోతి) ఎడిటర్ షఫీ ఉల్లా ఖాన్ ని , ( వాస్తవ నేస్తం) ఎడిటర్ కమర్ ( రిపబ్లిక్ హిందుస్థాన్) ఎడిటర్ రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సభ్యులందరూ కొన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.ఇందులో ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి పత్రికకు జిల్లా యంత్రాంగం అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని, జిల్లాలో నడుస్తున్న పత్రికల పబ్లిషర్ మరియు ఎడిటర్లకు ఆ పత్రిక ఎడిషన్ సెంటర్ నిర్వహించేందుకు వారి కార్యాలయాలకు ప్రభుత్వస్థలాన్ని, మరియు డబుల్ బెడ్ రూమ్ లను ప్రభుత్వం కేటాయించాలని తీర్మానించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగాన్ని కలిసి వినతి పత్రం సమర్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.