republichindustan.in
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 8:12 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

తపాలా శాఖలో నిధుల దుర్వినియోగం – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రిమాండ్

* రూ. 2,12,033/- దుర్వినియోగం చేసినట్లు కేసు నమోదు.

– రూరల్ సీఐ కే ఫణిదర్

తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో తపాలా శాఖకు చెందిన నిధులను దుర్వినియోగం చేసిన ఘటనలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

వివరాలలోకి వెళితే, రుయ్యడి గ్రామానికి చెందిన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం అనే వ్యక్తి రూ. 2,12,033/- మొత్తాన్ని చీట్ చేసి తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు తేలింది.

Thank you for reading this post, don't forget to subscribe!

వివరాలు వెల్లడిస్తున్న రూరల్ సీఐ కే ఫణిదర్

ఈ మేరకు పోస్టల్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.
దర్యాప్తు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఈరోజు ఆదిలాబాద్ రూరల్ సీఐ కే. ఫణిధర్ ఆధ్వర్యంలో రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తలమడుగు  ఎస్సై డి రాధిక పాల్గొన్నారు.