Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంద్రవెల్లి : రైతుబంధు పథకంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు ఇంట్లో కేసీఆర్ వెలుగులు నింపారని మాజీ ఎంపీ గోడం నగేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బాజాభజంత్రీలతో స్థానిక మార్కెట్ యార్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ర్యాలీలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ జాధవ్ శ్రీరాంనాయక్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులు వేసిన రంగవల్లులను పరిశీలించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు కింద రూ.50 వేల కోట్లు ఇచ్చిందన్నారు. రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ పోటే శోభాబాయి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ డోంగ్రే మారుతి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరెంగ గాంధారి సుంకట్ రావు, ఎంపిటిసి సభ్యురాలు జాధవ్ స్వర్ణలతా, గిత్తే ఆశాబాయి, సర్పంచులు కుడే కైలాస్, జాధవ్ లఖన్, ఆడే విజయా, ఉప సర్పంచ్ టేహరే గణేష్, ఆపార్టీ ప్రధాన కార్యదర్శి కనక హనుమంతరావు, పట్టణ అధ్యక్షులు కేంద్రే శ్యామ్, నాయకులు దేవుపూజే మారుతి, ముండే బాబు, సర్కాలే శీవాజీ, ఆరేళ్లీ రాందాస్, శ్రీనివాస్, నగేష్, రాంనివాస్, బాలసింగ్, తదితరులు పాల్గొన్నారు