రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్: సివిల్ సర్వీస్ డే (ఏప్రిల్ 21)సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రధాన మంత్రి మోడీ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న సందర్భంగా శనివారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పత్రిక ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి పుష్ప గుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడప సంతోష్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కి ఈ అవార్డు రావడం దేశం మొత్తం గర్వించ తగ్గ విషయం అని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా దేశవ్యాప్తంగా మారుమోగుతుందని మంచి పేరు రావడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడుప సంతోష,(అక్షర తెలంగాణ)ప్రధానకార్యదర్శి ఫిరోజ్ ఖాన్(సమయవాణి) శ్రీనివాస్ రెడ్డి, ( ప్రజాజ్యోతి)రత్నాకర్ (నేటివార్త)
Thank you for reading this post, don't forget to subscribe!