రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా లోని పలు మండలాల తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయినా తహసీల్దార్లు మరియు బదిలీ అయినా స్థానం వివరాలు ఇలా ఉన్నాయి. తహసీల్దార్ ఎం. సోము భీంపూర్ మండలం నుండి ఇంద్రవెల్లి మండలానికి బదిలీ అయ్యారు.
ఇంద్రవెల్లి తహశీల్దార్ టి రాఘవేంద్రరావు జైనథ్ మండలానికి ట్రాన్సపర్ అయ్యారు. తహసీల్దార్ బి మహేంద్రనాథ్ ను భీమ్ పూర్ మండలానికి, తాశీల్దార్ ఎ. సంధ్యా రాణి ను గుడిహత్నూర్ మండలానికి , తహశీల్దార్ జె. పవనచంద్ర ను నేరడిగొండ మండలానికి, నేరడిగొండ మండలం తహశీల్దార్ ఎస్. శ్రీదేవి ను తాంసి మండలానికి బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేయబడిన తహశీల్దార్లు కొత్త పోస్టింగ్ స్థలంలో రిపోర్టు చేయాలని మరియు చేరిన తేదీని వెంటనే తెలియజేయాలని ఆదేశించారు.
Thank you for reading this post, don't forget to subscribe!