హైదరాబాద్:అక్టోబర్ 01
సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం..
మంగళవారం ఆయనకు గుండె కు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయవలసి ఉండడంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం.
కాగా, ఆయన ఆసుపత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక 76 ఏళ్ల రజనీ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న వేట్టైయన్ అక్టోబర్ 10 న విడుదల కానుంది. అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణదశలో ఉంది.
ఇక దశాబ్దం క్రితం సూపర్ స్టార్ సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చేయించుకు న్నారు. ఆయన ఆరోగ్య కారణాలతో, డాక్టర్ల సలహాలతో రాజకీయాలకు కూడా దూరమయ్యారు.
Thank you for reading this post, don't forget to subscribe!