రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామంలోవిషాదం చోటుచేసుకుంది. తల్లితో కలిసి సొంత వ్యవసాయ క్షేత్రంలోని పంటలో కలుపు తీయడానికి వెళ్లి చేనులో ఉన్నా వ్యవసాయ బావిలో పడి ఓ పదిహేనేళ్ల బాలిక మృతి చెందింది. ఇచ్చోడ ఎస్సై పి ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ మరియు షేక్ రియనా బేగం ల కూతురు సపీలా బి (15) తన తల్లి తో కలిసి తమ సొంత వ్యవసాయ క్షేత్రంలో పంటలో కలుపు తీయడానికి వెళ్లారు. అయితే తమ చేనులో ఉన్న బావి నుండి త్రాగునిరు తీసుకరావడానికి సపిల బి వెళ్ళింది. నీళ్లు నింపే క్రమంలో కాలు జారీ బావిలో పడిపోయింది. ఈత రాకపోవడం తో నీటిలో మునిగి పోయింది. గమనించిన మృతురాలి తల్లి జరిగిన విషయం ఇంట్లో చెప్పడంతో షేక్ అహ్మద్ గ్రామస్తులతో కలిసి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!