కొణిజర్ల మే 26, రిపబ్లిక్ హిందుస్థాన్ : మండల పరిధిలో పల్లిపాడు వద్ద ఉదయం 5: 30 గంటలకు వైరా నుండి టూ వీలర్ మీద వచ్చే సింగరాయపాలెం గ్రామానికి చెందిన తెల్లబోయిన నరసింహారావు అనే వ్యక్తి వైరా వైపు వెళుతుండగా డీసీఎం వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ప్రమాదం జరగడంతో నరసింహారావు అక్కడికిక్కడే చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. నరసింహారావు కొడుకు నవీన్ ఫిర్యాదు మేరకు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ రావు తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!