republichindustan.in
Newspaper Banner
Date of Publish : 05 April 2023, 11:32 am Digital Edition : REPUBLIC HINDUSTAN

రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ వాచర్ మృతి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ వాచర్ జ్ఞానేశ్వర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో రోడ్డు పై పడి అటవీ శాఖలో వాచర్గా పనిచేస్తున్న బుర్కపల్లి గ్రామానికీ చెందిన జ్ఞానేశ్వర్ మృతి చెందాడు. 

నిన్న అర్థరాత్రి ఇచ్చోడ రేంజ్ పరిధిలో నైట్ పెట్రోలింగ్ కు హాజరయ్యేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదం సంభవించింది.