గుడిహత్నూర్ : ట్రాక్టర్ బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన గుడిహత్నూర్ మండలంలో మేకలగండి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది . స్థానిక ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం . మండలంలోని ధాంపూర్ గ్రామానికి చెందిన రత్నం రాకేష్ ( 45 ) తన స్వంత ట్రాక్టర్ తీసుకొని ఆదిలాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో మేకలగండి వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది .

దీంతో రాకేష్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా , పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం .

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments