ePaper
Thursday, February 12, 2026
📄 ePaper

ఆరుగురు పేకాట రాయుళ్ల పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


📰 రూ.3,60,370/- నగదు, పేకాట ముక్కలు స్వాధీనం

📰 అర్ధరాత్రి స్పెషల్ బ్రాంచ్, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్…

📰 ఒక కారు, రెండు మోటార్ సైకిల్లు, నాలుగు మొబైల్ ఫోన్లో స్వాధీనం

📰 దేవదూత్ జిన్నింగ్ మిల్ నందు నిర్వహిస్తున్న పేకాట స్థావరం


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి మూడు గంటల సమయంలో అదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ దూద్ జిన్నింగ్ మిల్ నందు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సిసిఎస్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదిలాబాద్ పట్టణ డిఎస్పి ఆధ్వర్యంలో మూకుమ్మడిగా దాడి చేసి పేకాట స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ లో నలుగురు నిందితులు సంఘటన స్థలంలో పట్టుబడగా ఇద్దరు పరారీ అయ్యారని తెలిపారు.

ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆరుగురు పై కేసు నమోదు చేయడం జరిగిందని వీరి వద్దనుండి పేకాట ముక్కలు రూ.3,60,370/- నగదు, ఒక కారు, రెండు మోటార్ సైకిల్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల వివరాలు
1) దిలీప్ కల్వడియా s/o అమ్ముభాయ్.
2) సందీప్ కొటావార్ s/o మాధవ్.
3) గిరీష్ పటేల్ మఖడీలాల్ s/o మోహన్ భాయ్.
4) గజానంద్ జిన్నేవార్ s/o మచ్చేంద్రనాథ్.
5) దేవన్న
6) భూమన్న

వీరందరూ పేకాట ఆడగా సంఘటనా స్థలంలో లభ్యమయ్యారని తెలిపారు. ఈ ఆపరేషన్ నందు డిఎస్పి వి ఉమేందర్, సిఐలు ఈ చంద్రమౌళి, జె కృష్ణమూర్తి, సిసిఎస్ సిబ్బంది జాకీర్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఏసుదాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!