republichindustan.in
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 7:14 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో ముగ్గురు రిపోర్టర్లపై కేసు, ఒకరి అరెస్ట్

బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు – బోథ్ సీఐ డి. గురుస్వామి .*

*ఫిర్యాదుదారున్ని బెదిరించి 60 వేలు వసూలు చేసిన నిందితులు.*

Thank you for reading this post, don't forget to subscribe!

ఆదిలాబాద్/బోథ్ :
సీఐ వివరాల ప్రకారం, ఫిర్యాదుదారు *కులకర్ణి శ్రావణ్ కుమార్ (51)* , తండ్రి: వినోద్ రావు,( పశు వైద్యాధికారి) , నివాసం: టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్. ఇతను 2023 సంవత్సరంలో సోనాలలో పశు వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో తన సహోద్యోగులతో కలిసి ఒక లక్ష రూపాయల చిట్టీ వేసుకున్నారు. చిట్టీ వచ్చిన రోజు పార్టీ చేసుకోవాలనే ఆచారం మేరకు, తేదీ: 15.07.2023 న ఫిర్యాదుదారికి చిట్టీ రావడంతో, అదే రోజు మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు తన సహోద్యోగులు దశగౌడ్ (రిటైర్డ్ జె.వి.ఓ.), ముత్యం రమణ (నివాసం: కౌట-బి) మరియు మహేందర్ జింగిజి లతో కలిసి పోచెర ఎక్స్ రోడ్ వద్ద ఉన్న బావార్చి దాబాలో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

ఆ సమయంలో
*కేసు నమోదు చేయబడినవారి వివరాలు*

1. గడ్డం అజయ్ రెడ్డి, నివాసం: తేజాపూర్ – మహా న్యూస్ రిపోర్టర్,(అరెస్ట్)
2. దినేష్, నివాసం: ధన్నూర్-బి – అమ్మ న్యూస్ రిపోర్టర్ (పరారీ)
3. బీమా ప్రవీణ్, నివాసం: కనుగుట్ట గ్రామం – రాజ్ న్యూస్ రిపోర్టర్ (పరారీ)
అనే ముగ్గురు అక్కడికి వచ్చి పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి, “మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవి మీడియా చానళ్లలో మరియు పత్రికల్లో ప్రచురిస్తే మీ పరువు పోతుంది” అంటూ బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ముగ్గురికి రూ.20,000/- చొప్పున మొత్తం రూ.60,000/- ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయని, వీడియోల వల్ల నష్టం జరుగుతుందేమోనన్న భయంతో ఫిర్యాదుదారు తన చిట్టీ డబ్బుల నుండి **రూ.60,000/-**ను నిందితుడు గడ్డం అజయ్ రెడ్డికి ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్న అనంతరం వీడియోలు డిలీట్ చేస్తామని చెప్పి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ఈ ఘటన వల్ల ఫిర్యాదుదారు మానసిక వేదనకు గురై, అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులపై బెదిరింపులు, అక్రమ డబ్బుల వసూలు, మోసం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు, ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు గానీ, సాధారణ ప్రజలు గానీ ఇలాంటి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఘటనలకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని బోథ్ సీఐ డి. గురుస్వామి ఈ సందర్భంగా సూచించారు.