31 క్వింటాళ్ల రాయితీ బియ్యం పట్టివేత, నిందితుని అరెస్టు….
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా లో పేదలకు దక్కాల్సిన రాయితీ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వనరుగా మారింది. గుట్టచప్పుడు కాకుండా జోరుగా కొనసాగుతున్న ఈ రాయితీ బియ్యం అక్రమ సరఫరా దందా పై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిసారించి నిఘాను పెంచారు అధికారులు.
సోమవారం ఆదిలాబాద్ పట్టణం లోని తిరుపెళ్ళి పెట్రోల్ బంక్ ఎదురుగా గల ఏరియా నందు ఒక గోడౌన్ లో భారీగా రాయితీ బియ్యం నిలువ ఉందని సమాచారం సేకరించిన టాస్క్ ఫోర్స్ సిఐ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం తనిఖీ చేయగా నిందితుడు క్రాంతి నగర్ కు చెందిన గూగుల్ వార్ రాజు (34) వద్ద 31 క్వింటాళ్ల రాష్ట్ర ప్రభుత్వం రాయితీ బియ్యం లభించిందని తెలిపారు. ఈ బియ్యాన్ని నిందితుడు శివాజీ చౌక్ నందు గల తన స్వంత గణపతి కిరానా లో ఈ రాయితీ బియ్యాన్ని విక్రయిస్తున్నారని తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై అధికారి బి మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగిందని తెలిపారు. తదుపరి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అంజమ్మకు కేసు నమోదు నిమిత్తం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్లో సిసిఎస్ సిబ్బంది గంగారెడ్డి, హనుమంతరావు, రాహత్ తదితరులు పాల్గొన్నారు.