సౌదీ అరేబియా రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి లక్ష్మీనారాయణ
గత కొన్ని రోజులుగా కుటుంబానికి అండగా నిలిచిన తెలుగు సామాజిక కార్యకర్తలు, టాసా మరియు సాటా ప్రతినిధులురియాద్: ఆంధ్రప్రదేశ్, కడపకు చెందిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం.ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) నిర్వహించగా, అనంతరం అధిక రక్తపోటు మరియు అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు...