నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
ప్రధాన నిందితుల అరెస్ట్ – రూ.19 లక్షల విలువైన విత్తనాలు, పురుగుమందులు స్వాధీనంరిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ, ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తూ కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. స్థానిక పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఆదిలాబాద్...