మీనాక్షిపురం సాయిబాబా ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం
మీనాక్షిపురం (రహిమత్‌నగర్), జూన్ 8: మీనాక్షిపురం (రహిమత్‌నగర్)లోని శ్రీ సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక సేవకులు అశోక్ సార్ పాల్గొని బాలబాలికలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా అశోక్ సార్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో పోరాడిన మహనీయుల త్యాగాలు, దేశభక్తి, సేవా భావం గురించి విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. యువత మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అలాగే, ప్రతి విద్యార్థి రోజుకు...