republichindustan.in
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 8:19 pm Digital Edition : SRINIVAS P

యువకుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురి రిమాండ్.*

  1. *పత్రికా ప్రకటన*
    ఆదిలాబాద్ జిల్లా
    జూన్

*మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.*

*మొబైల్ ఫోన్ లాక్కొని బలవంతంగా ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయించిన నిందితులు.*

*మావల సీఐ బి డి ప్రేమ్ కుమార్*

మావల పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడిని బెదిరించి, దోపిడీకి పాల్పడి నగదు వసూలు చేసిన ఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు మావల సీఐ బి.డి. ప్రేమ్‌కుమార్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే, గుడిహత్నూర్ మండలం శాంతన్‌పూర్ గ్రామానికి చెందిన సబ్లే రామేశ్వర్ (21) అనే యువకుడు జూన్ 4న ఉదయం మావల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గత సంవత్సరం కాలంగా తనకు ఆదిలాబాద్‌కు చెందిన ఒక యువతితో పరిచయం ఉందని, జూన్ 3న ఆమె ఫోన్ చేసి డుబ్బగూడ సమీపంలోని జాతీయ రహదారి-44 వద్దకు రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో నిందితులు అక్కడికి చేరుకుని యువతిని మరియు యువకుడిని ప్రశ్నించిన అనంతరం బాధితుడిని బెదిరించి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం అతని మొబైల్ ఫోన్ ద్వారా బలవంతంగా రూ.2,500లను బదిలీ చేయించడంతో పాటు దాడి చేసి ప్రాణహాని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపాడు.

*కేసులోని నిందితుల వివరాలు:*

A1. మహమ్మద్ సాదాబ్
A2. షేక్ జరార్
A3. షేక్ షకీర్
A4. సాదిక్
A5. సయ్యద్ జునైద్

ఫిర్యాదు ఆధారంగా పై ఐదుగురు నిందితులపై క్రైం నంబర్ 368/2026, సెక్షన్ 310(2) బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మావల సీఐ బి.డి. ప్రేమ్‌కుమార్ తెలిపారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.