republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 4:15 pm Digital Edition : SRINIVAS P

వెంకటేశ్వర రావుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి*

  1. *ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటి డిమాండ్*
    *ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై వెంటనే తగు చర్యలు చేపట్టాలి*
    //ఆదిలాబాద్//ది: 03-06-2026:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మడకం వారి గూడెంలో ఆదివాసి సేన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మడకం వెంకటేశ్వరరావు గారికి పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్ళటాన్ని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపినది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయని, అమాయక గిరిజనుల యొక్క వేలాది ఎకరాల భూములను గిరిజనేతరులు అన్యాయంగా ఆక్రమించుకొని సాగు చేసుకోవటం, అదేవిధంగా గిరిజనులు పండించిన పంటలను ధ్వంసం చేయడమే కాకుండ, అన్యాయంగా దోపిడీ చేసి దోచుకొని తీసుకువెళ్ళటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలను చేస్తున్నటువంటి క్రమములో కొంతమంది గిరిజనేతరులు, పోలీస్ అధికారులతో కుమ్మక్కై గతంలో అనేక రకాలుగా వెంకటేశ్వరరావు పై కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించారని, ఇప్పుడు దానిని సాకుగా చూపిస్తూ మరొక్క సారి ఆయనపై కేసు నమోదు చేయటాన్ని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోవ దౌలత్ రావు మొకాశి, మడి సాయి బాబు లు తెలిపినారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను గురించి ఆయన ప్రశ్నిస్తే ఆయనపై రౌడీ షీటర్ కేసు పెట్టడం ఎంత వరకు సబబు అని వారు వాపోయారు. కొంత మంది గిరిజనేతరులు, పోలీసు అధికారులు వెంకటేశ్వర రావు మరియు ఆయన అనుచరుల పై కావాలనే ఆయుధాలతో గిరిజనేతరులను బెదిరించినట్లు వాంగ్మూలాలను తీసుకొని రాయించుకున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా ఇప్పటికీ కొంత మంది పోలీసు అధికారులు అక్కడి గిరిజన గ్రామాలకు వెళ్లి గిరిజన మహిళలను తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని భయబ్రాంతులకు గురి చేయటం మా దృష్టికి వచ్చినదని ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామానికి చెందిన గద్దె దుర్గారావు మరియు ఇంకొంత మంది గిరిజనేతరులు వెంకటేశ్వర రావు మరియు అతని అనుచరులపై ఇచ్చిన ఫిర్యాదును వెంటనే వెనక్కి తీసుకోవాలని, పోలీసులు అన్యాయంగా, అక్రమంగా బనాయించిన కేసును వెంటనే ఎత్తి వేయాలని వారు డిమాండ్ చేశారు. లేని యెడల ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న గిరిజనేతరులను, అక్రమంగా గిరిజనుల భూములను ఆక్రమించుకొని సాగు చేస్తున్న గిరిజనేతరులను ఏజెన్సీ ప్రాంతం నుండి బయటకు పంపించే ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.