republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 9:09 pm Digital Edition : SRINIVAS P

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

  1. *పత్రికా ప్రకటన*
    అదిలాబాద్ జిల్లా,

    జూన్

*37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు,54 మద్యం బాటిల్స్ స్వాధీనం.*

*లభ్యమైన 6 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఇద్దరు మైనర్ డ్రైవింగ్*

*గంజాయి, ఉద్యోగ మోసాలు, అరైవ్ అలైవ్, సైబర్ క్రైమ్, డ్రగ్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లపై అవగాహన.*

*సిసిటీవీ కెమెరాల ఆవశ్యకతపై వివరణ*

*స్థానిక ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం.*

*పోలీసు జాగిలం రూమాతో గంజాయి తనిఖీలు.*

బుధవారం సాయంత్రం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 80 మంది పోలీస్ సిబ్బంది సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 37 ద్విచక్ర వాహనాలు 6 ఆటోలు లభ్యమైనట్లు అందులో ఆరు వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు మైనర్ వ్యక్తులు వాహనాలు నడపగా పట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కువమంది ప్రజలు వాహన నియమ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నట్లు గమనించడం జరిగిందని ప్రమాదాలను అరికట్టడానికి అరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో హెల్మెట్ యొక్క ఆవశ్యకతను మరియు రోడ్డుపై ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని సూచించారు. గంజాయి జీవితాలను నాశనం చేస్తుందని గంజాయి దేశ భవిష్యత్తు నిర్ణయించే యువత భవితవ్యం అగమ్య గోచరంలో ఉంటుందని గంజాయి బారిన పడవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతాయని వాటి వల్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాలను ఆవశ్యకత వివరించి నియంత్రణలో సిసిటివి కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు కె నాగరాజు, రహీం పాషా, కె ఫణి ధర్, ఎస్సైలు వి విష్ణువర్ధన్, దేవేందర్, పోలీసు జాగిలం రోమా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.