NEET రీ-ఎగ్జామ్‌పై పారదర్శకత కోరిన సౌదీ అరేబియా తెలుగు సంఘం (SATA) — ప్రవాస విద్యార్థుల సమస్యలపై NTAకు విజ్ఞప్తి

హిందుస్థాన్, రియాద్ ప్రతినిథి : ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు చేసిన NEET పరీక్షను మళ్లీ నిర్వహించే ప్రక్రియలో పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుత వైఖరిని పాటించాలని సౌదీ అరేబియా తెలుగు సంఘం (SATA) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను కోరింది. జూన్ 21న NEET రీ-ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందని వచ్చిన వార్తల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరుగుతున్న ఆందోళనపై సంఘం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా విదేశాల్లో పరీక్ష రాసి తరువాత భారత్‌కు తిరిగి వెళ్లిన ప్రవాస విద్యార్థులు...